న్యూఢిల్లీలోని యశోభూమి (ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్)లో SEMICON India 2026 ఐదో ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
“సిలికాన్ నుంచి సిస్టమ్స్ వరకు: పటిష్టమైన ఎకోసిస్టమ్ నిర్మాణం” అనే థీమ్‌తో ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM), ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY), SEMI సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల గ్లోబల్ సమ్మిట్‌లో 52 దేశాల నుంచి 600కు పైగా ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలు, టెక్ దిగ్గజాలు, ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ప్రపంచ టెక్ నాయకులు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ చిప్ డిజైన్‌లో ఉన్న నైపుణ్యం నుంచి పూర్తి స్థాయి సెమీకండక్టర్ తయారీ అసెంబ్లీ టెస్టింగ్ సామర్థ్యాల దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
విశ్వసనీయమైన పటిష్టమైన గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా గొలుసు కేంద్రంగా భారత్ ఎదుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. దేశీయ ప్రతిభను అభివృద్ధి చేయడం చిప్ తయారీ సామర్థ్యాలను పెంచడం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం వంటి వ్యూహాత్మక చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.
