
D News: మృణాల్ ఠాకూర్ నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. 2022లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా మేకర్స్ అక్టోబర్ 2, 2026న జీ5లో నేరుగా డిజిటల్ ప్రీమియర్ చేయనున్నట్లు ప్రకటించారు.
స్టాకర్ థ్రిల్లర్‌గా సినిమా
నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించే వ్యక్తి కథను చూపించనున్నారు. మృణాల్ ఠాకూర్ పూజ పాత్రలో నటించగా, హ్యూమా ఖురేషి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. విజయ్ రాజ్ కీలక పాత్ర పోషించారు.
ఐదు భాషల్లో స్ట్రీమింగ్
జీ5లో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్లలోనూ సినిమా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత విడుదలవుతున్న ఈ థ్రిల్లర్‌పై మృణాల్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
