కేంద్ర హోం సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా గుజరాత్లోని వడ్నగర్లో దేశవ్యాప్త ‘సేవా యాత్ర’ ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మస్థలమైన వడ్నగర్ నుంచి సేవాసంకల్పఅభియాన్ ఆధ్వర్యంలో ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన శ్రీ నరేంద్ర మోదీ ప్రజాసేవా ప్రస్థానం ప్రధానమంత్రిగా కొనసాగుతూ 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
వడ్నగర్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా సేవ (నిస్వార్థ సేవ), సుపరిపాలన పేదల సంక్షేమం అనే ప్రధాన సూత్రాలను ప్రస్తావించారు.
దేశంలోని వివిధ జిల్లాలు రాష్ట్రాల మీదుగా సాగే ఈ సేవా యాత్రలో రక్తదాన శిబిరాలు, ఆరోగ్య పరీక్షా శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
