దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిగా ఆలపించారు. ఎర్రకోటపై వందేమాతరాన్ని సంపూర్ణంగా ఆలపించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

ఆ తర్వాత జాతీయ గీతం ‘జన గణ మన’ను ఆలపించగా భారత వాయుసేనకు చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఆకాశంలో విన్యాసాలు చేస్తూ పూలవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ జాతీయ జెండాను, మరో హెలికాప్టర్ ‘వందేమాతరం’ అని రాసిన పతాకాన్ని మోసుకెళ్లి వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి. ‘వందేమాతరం’ గేయం 150వ వార్షికోత్సవం సందర్భంగా గతేడాది నవంబర్ 7 నుంచి ఏడాది పాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో జాతీయ గీతం ‘జన గణ మన’తో సమాన హోదా కల్పిస్తూ ‘వందేమాతరం’కు సంబంధించి కేంద్రం కీలక చట్టపరమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల ప్రకారం వందేమాతరాన్ని అవమానించడం లేదా గేయం ఆలపిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. ‘వందేమాతరం’ గేయాన్ని తొలిసారిగా 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు.

By Rajini

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana