
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వికసిత్ భారత్’ ఆర్థిక సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన ఆర్థిక వనరులు విధానాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
కేంద్ర రాష్ట్రాల మధ్య విధాన సమన్వయం దేశ ఆర్థికాభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు విధాన ప్రాధాన్యతలు మైక్రో ఎకనామిక్ పరిస్థితులు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. వ్యవసాయ రంగంలో పరివర్తనకు అవసరమైన ఆర్థిక వనరులు ఎనర్జీ ట్రాన్సిషన్‌కు నిధుల సమీకరణపైనా సదస్సులో చర్చించే అవకాశం ఉంది.
ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్థిక శాఖ మంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఆర్థిక శాఖ కార్యదర్శులు కూడా సదస్సులో పాల్గొంటున్నారు.
