
దేశవ్యాప్తంగా తనకు అందుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 76వ పుట్టినరోజు సందర్భంగా ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ చేపట్టిన ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంపై మోదీ మాట్లాడుతూ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆశీర్వాదాలు దేశసేవ పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు.
మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గాయని స్నేహా శంకర్, కళాకారుడు అమన్ పంత్ రూపొందించిన ‘ఆశీర్వాద్ కా దియా’ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. మోదీ పుట్టినరోజుతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తుచేస్తూ ఈ పాటను అంకితం చేశారు.
ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ ప్రజల నుంచి అందుతున్న ఆశీర్వాదాలు దేశానికి సేవ చేయాలన్న తన నిబద్ధతను మరింత పెంచుతున్నాయని తెలిపారు.
