DNews:21 Nov:హైదరాబాద్‌ శుక్రవారం రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ (Moinabad) మండలం కనకమామిడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కనకమామిడి వద్ద బీజాపూర్‌ హైవేపై, తాజ్‌ డ్రైవ్‌ ఇన్‌ సమీపంలో రెండు కార్లు వేగంగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరొకరు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించిన తర్వాత చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.గాయపడిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే దవాఖానకు తరలించారు. ప్రమాదం ధాటికి రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదం జరిగిన తీరు, మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana