DNews: Nov 21: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (GHMC) బాల్దియా అధికారులు అన్నపూర్ణ స్టూడియో మరియు రామానాయుడు స్టూడియోలకు పెద్ద షాక్ ఇచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజుల విషయంలో ఈ రెండు స్టూడియోలు తక్కువ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు బయటపడింది. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి భారీగా పన్ను ఎగవేత చేస్తున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో GHMC అధికారులు పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. వివరాల ప్రకారం, అన్నపూర్ణ స్టూడియో రూ.11.52 లక్షలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.49 వేల రూపాయలు మాత్రమే చెల్లించింది. అదే విధంగా GHMC సర్కిల్ 18 అధికారులు రామానాయుడు స్టూడియో రూ.1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.1900 మాత్రమే చెల్లించినట్లు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాల్దియా అధికారులు రెండు స్టూడియోలకు నోటీసులు పంపి, పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఆదేశించారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana