DNews: Nov 21: మార్చి నెల తెలంగాణ మెట్రో రైలు ప్రాజెక్టుకు కీలకంగా మారనుంది. ఎల్ & టీ నిర్వహిస్తున్న మొదటి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి చర్యలు ప్రారంభించగా, మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశ విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2(A)లో 5 మార్గాలు, 2(B)లో 3 మార్గాలను ప్రతిపాదించింది. ఈ విస్తరణను కేంద్రం–రాష్ట్రం సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఎల్ & టీతో జరిగిన చర్చల్లో, సంస్థ ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమని తెలిపిన తర్వాత ఇంతకాలం కొనసాగిన అడ్డంకి తొలగిపోయింది. ఈ నేపథ్యంలో స్వాధీనం ప్రక్రియను మార్చి చివరి నాటికి పూర్తి చేయడానికి చర్యలు వేగవంతం అయ్యాయి. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 8 మార్గాల విస్తరణపై సాధ్యత పరిశీలించి, అనుమతులపై నిర్ణయం మార్చి నెలలో తీసుకుంటామని తెలిపారు. అందువల్ల మొదటి దశ స్వాధీనం ప్రక్రియను కూడా అదే సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana