
DNews:14 Feb: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాజకీయ ఫిరాయింపుదారులకు ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఛైర్పర్సన్ వంటి కీలక పదవిని అనుభవించి, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లెల రాజశ్రీకి నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు.
భీంగల్ మున్సిపాలిటీలోని 9వ వార్డు నుంచి గతంలో బీఆర్ఎస్ తరపున గెలిచి ఛైర్పర్సన్గా పనిచేసిన మల్లెల రాజశ్రీ, ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా అదే వార్డు నుంచి బరిలోకి దిగారు. అధికార పార్టీలో చేరితే సులభంగా గెలవొచ్చని ఆమె భావించినప్పటికీ, ఓటర్లు ఆమెకు ఓటు వేయకుండా పరాజయం రుచి చూపించారు.
ఈ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి రవి నీలం, మల్లెల రాజశ్రీపై 75 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఫిరాయింపుదారులను ప్రజలు ఆదరించరని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.
