
DNews: Feb 14: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త ఇవ్వబోతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్హులైన రైతులకు ఎకరాకు రూ.6,000 చొప్పున ఈ సహాయం అందించనుంది. ఈ నిధుల విడుదల తేదీగా ఫిబ్రవరి 17ని నిర్ణయించినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలతో పాటు స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంసీటీసీ ఎన్నికల్లో మరింత బలంగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
