
DNews:14 Feb: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల వ్యవహారం మరోసారి రాజుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్‌లో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఆయన, అధిష్టానం తనకు ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాను మంత్రి పదవి కోసం ఎవరినీ బ్రతిమలాడుకోనని, సమయం వచ్చినప్పుడు పదవిని లాక్కుంటానని ఘాటుగా హెచ్చరించారు. ఒకవేళ తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే, తన తదుపరి లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీనేనని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తాను పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని పనిచేశానని, అయినా తనను విస్మరించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే బాధ్యత తాను తీసుకుంటానని అనుచరుల ముందు ప్రకటించారు.
