
DNews:26 Nov:హైదరాబాద్‌లో ఒక నకిలీ IAS, IPS అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు అధికారులకన్నా ఎక్కువ స్టైల్లో తిరుగుతూ, సైరన్ కారులో రౌండ్లు కొడుతూ, ఇద్దరు రిటైర్డ్ ఆర్మీ అధికారులను బాడీగార్డులుగా పెట్టుకుని వసూళ్లు చేస్తూ వచ్చిన ఈ మోసగాడు చివరకు ఫిలింనగర్ పోలీసుల బుట్టలో పడ్డాడు.నిందితుడు బత్తుల శశికాంత్. తాను IAS, IPS, NIA అధికారినని చెప్పుకుంటూ నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకొని నగరంలో తిరుగుతున్నాడు. తన వద్ద బాడీగార్డ్స్ ఉన్నారు… వారు గన్ లైసెన్స్ కలిగిన రిటైర్డ్ ఆర్మీ అధికారులు. ఈ లుక్‌తో ప్రజలను భయపెట్టడం, డబ్బులు వసూలు చేయడం అతని రొజూ పని.
షేక్ పేట్ పరిధిలోని ఒక జిమ్‌లోకి వెళ్లి తన బాడీగార్డులను చూపించి, ‘ప్రొటెక్షన్ పేరుతో’ 18 లక్షల రూపాయలు దోచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.పోలీసుల దాడిలో ఏమి దొరికింది. నకిలీ IAS, IPS, NIA ఐడీ కార్డులు, రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, పలు గాడ్జెట్స్, సైరన్ ఉన్న వాహనం,ఫిలింనగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ ప్రకటించారు.శశికాంత్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను వ్యక్తిగత బాడీగార్డులుగా నియమించుకోవడం చట్టవిరుద్ధమని, వ్యక్తిగత భద్రత కోసం పొందిన గన్లైసెన్సులను జాబ్ పర్పస్‌కి ఉపయోగించరాదని స్పష్టం చేశారు.నిందితుడికి సహాయపడిన ఇద్దరు రిటైర్డ్ ఆర్మీ వ్యక్తులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.
