
DNews: Nov 26: కాజీపేట పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన రామ్‌కిరణ్ (22) కాజీపేటలోని డీజిల్ కాలనీలో నివాసం ఉంటూ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాజీపేట సబ్‌ఇన్‌స్పెక్టర్ శివ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రామ్‌కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
