
D Educt: Aug 25: ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మిగిలిపోయిన ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి స్పాట్ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మిగిలిన సీట్లలో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు.
కళాశాలలు, బ్రాంచీలతో పాటు కేటగిరీల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలను ఆగస్టు 27న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు శ్రీదేవసేన వెల్లడించారు. విద్యార్థులు ఖాళీ సీట్ల వివరాలను పరిశీలించి, సంబంధిత కళాశాలల్లో స్పాట్ ప్రవేశాలకు హాజరుకావచ్చని సూచించారు.
