80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్రివర్ణ పతాకం స్వాతంత్ర్యానికి ప్రతీక అని, ప్రతి పౌరుడూ దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని పేర్కొన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, రైతులు, కార్మికులు, క్రీడాకారులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, సఫాయి మిత్రలు, సైనికులు, పోలీసులు తదితరులు దేశ ప్రగతికి అందిస్తున్న సేవలను రాష్ట్రపతి ప్రశంసించారు.
2047 నాటికి వికసిత్ భారత్ నిర్మించడమే లక్ష్యమని, అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయుల సేవలను స్మరించుకున్నారు.
విభజన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన లక్షలాది భారతీయులను ఆగస్టు 14న స్మరించుకున్నారు. స్వాతంత్ర్యం అనంతరం 550కుపైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ ఐక్యతకు బలమైన పునాది వేసిన లౌహ పురుషుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఘన నివాళులర్పించారు.

