
తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఈ ప్రక్రియలో ఇప్పటివరకు 73,95,954 ఓట్లు తొలగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. 78.14 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ నమోదైంది.
డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా 94.30 శాతంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతంతో ఉన్నాయి. జగిత్యాలలో 89.60 శాతం, కుమురం భీమ్ ఆసిఫాబాద్లో 89.45 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది.
ఇక హైదరాబాద్ జిల్లా 58.58 శాతంతో చివరి స్థానంలో ఉంది. మేడ్చల్–మల్కాజిగిరి 63.82 శాతం, రంగారెడ్డి 64.91 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రెండు సార్లు గడువు పొడిగించినప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో డిజిటలైజేషన్లో పెద్దగా పురోగతి కనిపించలేదు.
