
DNews:12 Dec: చేవెళ్ల మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడినవి, వదిలివేసినవి, క్లెయిమ్ చేయని మొత్తం 294 వాహనాలు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ వాహనాలను ఆన్లైన్ ద్వారా పబ్లిక్ వేలం వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
పోలీసులు ఇచ్చిన ప్రకటన ప్రకారం—ఈ వాహనాలపై ఎవరికైనా యాజమాన్య హక్కులు లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నట్లయితే, ఈ ప్రకటన తేదీ నుంచి ఆరు నెలల్లోపే సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.గడువులోగా స్పందించని పక్షంలో, ఆ వాహనాలను పబ్లిక్‌లో వేలం వేయనున్నారు.వివరాల కోసం మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆర్ఐ ఎన్. వీరలింగం (94906 17317) ను సంప్రదించవచ్చని తెలిపారు.వాహనాల పూర్తి వివరాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్ (www.cyberabadpolice.gov.in) లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
