DNews: Dec 12: హైదరాబాద్‌లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్ టి. ప్రభాకర్ రావు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ముందు లొంగిపోయారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనను కస్టడీలో విచారించేందుకు అనుమతి లభించింది. ఇప్పటికే ఆరు సార్లు సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించినప్పటికీ, ప్రభాకర్ రావు విచారణలో సహకరించలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో సుప్రీం కోర్టు ఆయనను కస్టడీలో విచారించేందుకు అనుమతిస్తూ లొంగిపోవాలని ఆదేశించింది.

ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వెంకటగిరి ఎదుట హాజరయ్యారు. ఆయనపై రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు మరియు ఇతరులపై అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, సిట్ దర్యాప్తు ప్రకారం ఆయన ఆధ్వర్యంలో సాక్ష్యాలను నాశనం చేయడం, హార్డ్ డ్రైవ్‌లు తొలగించడం, ఐక్లౌడ్ డేటాను డిలీట్ చేయడం వంటి చర్యలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా పరిగణించబడుతున్నారు. ప్రస్తుతం ఆయనపై విచారణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొనసాగుతోంది.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana