DNews:12 Dec: జీహెచ్ఎంసీ విలీనం అనంతరం వార్డుల డీలిమిటేషన్పై సభ్యుల అభిప్రాయాలను సేకరించేందుకు స్పెషల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 16న నిర్వహించనున్నట్లు బల్దియా అధికారులు ప్రకటించారు.డిసెంబర్ 9న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 15 వరకు ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, మరియు సభ్యుల అభిప్రాయాలపై 16న జరిగే ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే డీలిమిటేషన్‌కు తుది ఆమోదం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

డీలిమిటేషన్ ప్రతిపాదనలను బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. వీరు 16న జరిగే సమావేశంలో అధికారులను నిలదీసే అవకాశమున్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.కౌన్సిల్ సమావేశం అనంతరం డిసెంబర్ 18న స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో 2026–27 వార్షిక బడ్జెట్ పై చర్చించనున్నారు.విలీనమైన 27 సర్కిళ్లతో కూడిన నూతన బడ్జెట్ ప్రతిపాదనపై సమగ్ర చర్చ జరగనుంది. అనంతరం మరో కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌కు తుది ఆమోదం తెలపబడుతుంది.ఈ సమావేశం ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో చివరిది కానుందని జీహెచ్ఎంసీ వర్గాలు వెల్లడించాయి.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana