DNews:11 NOV:వరంగల్ పోలీసులు రబీ సీజన్‌లో భారీ స్థాయిలో జరిగిన ధాన్యం కొనుగోలు అక్రమాలను భయటకు తీశారు. వరంగల్ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట కాంట్రపల్లి ఐకేపీ కేంద్రంలో జరిగిన ఈ అవకతవకల్లో రైస్ మిల్లు యజమాని బెజ్జంకి శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు, బంధువులు సహా మొత్తం 13 మందిని పోలీసులు అట్టక్రోశించారు.మంగళవారం హనుమకొండలో డీసీపీ అంకిత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. శాయంపేట పోలీసులు–టాస్క్‌ఫోర్స్‌ సంయుక్త దర్యాప్తులో ఈ అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన సాంబశివతో కలిసి బెజ్జంకి శ్రీనివాస్ అనేక నకిలీ రైతుల పేర్లతో పాటు, తన కుటుంబ సభ్యులు మరియు బంధువుల పేర్లను వినియోగించి ధాన్యం కొనుగోళ్లలో భారీ మోసం చేశాడు.మొత్తం అక్రమ ధాన్యం 8,049 క్వింటాళ్లు అక్రమాల విలువ ₹2 కోట్లు 10 లక్షలు క్లుప్తంగా కొనుగోలు కేంద్ర ఇంచార్జీ, ఏఈఓ సహకారంతో నకిలీ రికార్డులు సృష్టించి ప్రభుత్వాన్ని మోసగించారు.

ప్రధాన నిందితుడు రైస్ మిల్లు యజమాని బెజ్జంకి శ్రీనివాస్, అతని భార్య, ముగ్గురు కుమారులు మిగతా బంధువులుమొత్తం 13 మంది అరెస్ట్ చేశారు.స్వాధీనం చేసిన వస్తువులు ₹9.50 లక్షల నగదు, ఒక కారు, ₹32 లక్షల విలువైన వ్యవసాయ భూమి పత్రాలు ,బ్యాంకులో ఉన్న ₹54 లక్షలు ఫ్రీజ్.

డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ, ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana