DNews:11 NOV:కొండాపూర్‌లోని దుర్గం చెరువు పరిసరాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చెరువుల్లో ఇళ్లు నిర్మించారన్న కారణంతో హైడ్రా అధికారులు గృహాలను కూల్చివేస్తూ కఠిన చర్యలు తీసుకుంటుండగా, అదే చెరువులో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ పార్కింగ్‌ను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ఐటీ కారిడార్‌కు గుర్తింపు కాగా, పర్యాటక ప్రాంతంగా పేరొందిన దుర్గం చెరువు ఒడ్డున అక్రమంగా మట్టి నింపి, వందలాది ప్రైవేట్ బస్సులు నెలల తరబడి పార్క్‌ అవుతున్నాయి.పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లపై అధికారుల దూకుడు కొనసాగుతున్నా, ఈ భారీ స్థాయి చట్టవిరుద్ధ పార్కింగ్‌పై మాత్రం ఎలాంటి చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.అక్రమ పార్కింగ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.

గత ప్రభుత్వ కాలంలో చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెరువు అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినట్లు ప్రజలు పేర్కొంటున్నారు. చెరువులోకి డ్రైనేజీ మురుగుజలాలు చేరుతుండడం,వాకర్లకు, సందర్శకులకు తీవ్రమైన ఇబ్బందులు, నీటిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో ఇటీవలే పెద్ద సంఖ్యలో చేపల మరణం,ఇవన్నీ ప్రజలు ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా అభివర్ణిస్తున్నారు.సోషల్ మీడియాలో ఈ విషయంపై వేలాది పోస్టులు వైరల్ కావడంతో, అధికారుల స్పందన కోసం వేచి చూస్తున్నారు.

అక్రమ పార్కింగ్‌పై ఫిర్యాదు చేశామని ఇరిగేషన్ EE

ఈ వివాదంపై స్పందించిన ఇరిగేషన్ శాఖ EE శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ—

  • దుర్గం చెరువులో జరుగుతున్న అక్రమ పార్కింగ్‌పై ఫిర్యాదు అందిందని,
  • నాలుగు రోజుల క్రితం శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులను సమాచారం ఇచ్చామని,
  • త్వరలోనే ఈ అక్రమ పార్కింగ్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అంతేకాకుండా చెరువులో మట్టిని తొలగించి అభివృద్ధి పనులను పునఃప్రారంభిస్తామని తెలిపారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana