
DNews:11 NOV:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటమి భయం వెంటాడుతోందన్న భావనతో కాంగ్రెస్ నేతలు యూసుఫ్‌గూడ డివిజన్‌లో అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని వారు పేర్కొన్నారు.
దొంగ ఓటర్ల పట్టింపు – పోలీసుల నిర్లక్ష్యం?
ఈ వ్యవహారాన్ని గమనించిన బీఆర్ఎస్ నాయకులు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, వారిలో మహిళలు అధికంగా ఉన్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఎల్‌బీనగర్‌కు చెందిన మహిళ యూసుఫ్‌గూడలో ఓటు వేసిందని ఈ విషయం ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
వోటర్ జాబితాలోని వివరాలు మరియు ఐడీ కార్డు వివరాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. దొంగ ఓట్లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడినుంచి తొలగించారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీనగర్ కాలనీలోని అమరావతి స్కూల్‌లోని బూత్‌లు 235 నుంచి 240 వరకు భారీగా నకిలీ ఓట్లు వేసే ప్రయత్నం జరిగినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అలాగే కృష్ణానగర్‌లో కూడా ఇదే తరహా ఘటనలు వెలుగుచూశాయి. మాకు దొంగ ఓట్లపై ఎలాంటి చర్యలు అవసరం లేదంటూ పోలీసులు చూపిన ప్రతాపంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారుబోరబండ డివిజన్‌లో బస్టాప్ పక్కనున్న పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ తిరిగినప్పటికీ వారికి అడ్డంకులు లేకుండా పోలీసులు భద్రత కల్పిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది
