DNews:24 Nov:సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో పోలీసులు భారీగా పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పట్టుకున్నారు. సూదబత్తుల నాగరాజు అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా ఈ బియ్యాన్ని నిల్వ ఉంచుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. నిందితుడు ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, తన ఇంట్లో నూకలుగా తయారుచేసే మిషన్ ఏర్పాటుచేసి ఈ దందాను నిర్వహిస్తున్నాడు. ఈ దాడుల్లో పోలీసులు 5 క్వింటాళ్ల 50 కేజీల రేషన్ బియ్యం, అంతే మొత్తంలో 5 క్వింటాళ్ల 50 కేజీల నూకలు మరియు ఆ మిషన్​ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాల్సిన బియ్యాన్ని ఎవరైనా దుర్వినియోగం చేసి పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య ఈ సందర్భంగా హెచ్చరించారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana