DNews: Nov 24: హైదరాబాద్‌లో మాధాపూర్ SOT పోలీసులు మాదకద్రవ్యాల విక్రయాలపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మూడు పోలీస్‌స్టేషన్ పరిధుల్లో ఒకేసారి ఎనిమిది మంది డ్రగ్ పేడ్లర్లను అరెస్ట్ చేశారు. నర్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గోపీనగర్ వద్ద బస్సులో డ్రగ్స్ తీసుకువస్తున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక సమాచారం ఆధారంగా మాధాపూర్ SOT పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 15 గ్రాముల MDMA మరియు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ బెంగళూరులో నుండి మాదకద్రవ్యాలను తెచ్చి, నూతన సంవత్సర వేడుకలను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాధాపూర్ పోలీసులు మొత్తం ముగ్గురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా, కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 42 కిలోల గంజాయి స్వాధీనం చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana