
DNews:17 NOV:హనుమకొండ బస్ స్టేషన్ నుంచి వరంగల్-1 డిపోకు చెందిన శ్రీశైలం మరియు తిరుపతి వయా హైదరాబాద్ వెళ్లే రెండు రాజధాని ఏసీ బస్సు సర్వీసులను రీజినల్ మేనేజర్ డి.విజయభాను నవంబర్ 17న ప్రారంభించారు. తిరుపతికి వెళ్లే రాజధాని ఏసీ బస్సు ప్రతిరోజు ఉదయం 8:40 గంటలకు హనుమకొండ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3:45 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా, శ్రీశైలం వెళ్లే రాజధాని ఏసీ బస్సు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు హనుమకొండ నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ బస్సు ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్ మీదుగా ప్రయాణిస్తుంది. శ్రీశైలం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 7:15 నిమిషాలకు హనుమకొండ చేరుకుంటుంది. ఈ కొత్త ఏసీ బస్సు సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఎం విజయభాను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం భానుకిరణ్, వరంగల్-1 డిపో మేనేజర్ అర్పిత సహా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
