DNews:20 Nov:హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ మండలం నర్కుడా వద్ద గురువారం (నవంబర్ 20, 2025) జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కిరాయి విషయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ తీవ్రం కావడంతో, ఒక ప్రయాణికుడు ఆగ్రహంతో తన వద్ద ఉన్న ఎయిర్‌ గన్‌తో మరో ప్రయాణికుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సమీర్‌దాస్‌ అనే వ్యక్తి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి వివరాలు, మరియు అతను ఎయిర్ గన్‌ను కలిగి ఉండటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana