
DNews:11 Dec: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. డిసెంబర్ 11 ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం 1 గంటకు అధికారికంగా పూర్తయింది. అయితే సమయం ముగిసిన తర్వాత కూడా అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూ లైన్లలో ఉండటంతో, మధ్యాహ్నం 1 గంటలోపు లైన్లో నిలబడి ఉన్నవారికి ఓటు హక్కు వినియోగం కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా యువత నుండి వృద్ధుల వరకు భారీగా ఓటు వేసేందుకు ముందుకొచ్చారు. దీంతో తొలి విడతలో ఆశించిన దానికంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది.మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత విజేతలను వరుసగా ప్రకటించనున్నారు. అనంతరం సర్పంచ్లు, వార్డ్ సభ్యులు కలిసి ఉప సర్పంచ్ల ఎన్నిక చేపడతారు.ఈ విడతలో మొత్తం 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డ్ మెంబర్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.
కొన్ని చోట్ల చిన్నపాటి ఘటనలు మినహా, మిగతా ప్రాంతాల్లో పోలింగ్ పూర్తిస్థాయిలో ప్రశాంతంగా కొనసాగింది. ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించగా, రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించింది. ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ సాయంతో పోలింగ్ ప్రతి దశను అబ్జర్వ్ చేశారు.అత్యధికంగా వరంగల్ జిల్లాలో, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం నమోదైనట్లు సమాచారం.
