DNews:28 Apr: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఒక మొబైల్ షాపు యజమాని ప్రకటించిన వినూత్న ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు సదరు యజమాని ఈ క్రేజీ నిర్ణయం తీసుకున్నాడు.

దమ్మపేటలోని ఒక ప్రైవేట్ మొబైల్ అవుట్‌లెట్ వద్ద “ఎయిర్‌టెల్ (Airtel) కొత్త సిమ్ తీసుకున్నా లేదా పాత సిమ్ ను ఎయిర్‌టెల్‌లోకి పోర్ట్ (MNP) చేసుకున్నా లీటర్ పెట్రోల్ ఉచితం” అనే బోర్డు వెలిసింది. ఈ ఆఫర్ గురించి తెలియడంతో స్థానిక యువకులు మరియు వాహనదారులు సదరు మొబైల్ షాపు వద్ద క్యూ కడుతున్నారు. సిమ్ కార్డ్ యాక్టివేషన్ పూర్తయిన వెంటనే, యజమాని కస్టమర్లకు పెట్రోల్ బంకులో పోయించుకోవడానికి వీలుగా కూపన్లను అందజేస్తున్నాడు.

వ్యాపారాన్ని పెంచుకోవడానికి వినూత్నంగా ఆలోచించిన ఈ యజమాని ఐడియాపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి” అంటూ కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు ఈ ఆఫర్ పరిమితి గురించి ఆరా తీస్తున్నారు. ఏదేమైనా, ఒక లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలకు పైనే ఉన్న సమయంలో ఇలాంటి ఉచిత ఆఫర్ దమ్మపేట వాసులకు మంచి ఊరటనిస్తోంది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana