DNews:27 Apr: హైదరాబాద్‌ను మహిళలకు అత్యంత సురక్షితమైన నగరం (Safe City)గా భావిస్తారు, కానీ తాజాగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) సైకిల్ ట్రాక్ పై ఒక యువతికి ఎదురైన భయానక అనుభవం ఈ నమ్మకాన్ని ప్రశ్నిస్తోంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఉదయం 6:15 గంటల సమయంలో ఒక యువతి నానక్‌రామ్‌గూడ/ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని సోలార్ సైకిల్ ట్రాక్‌పై రన్నింగ్ చేస్తుండగా, ఒక వ్యక్తి ఆమెను వెంబడించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ వ్యక్తి ఆమె ముందే బహిరంగంగా హస్తప్రయోగం (Masturbating) చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ ఘటనపై సదరు యువతి ఇన్ స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. “నేను ఎప్పుడూ హైదరాబాద్ సేఫ్ సిటీ అని గర్వంగా చెప్పుకునేదాన్ని, కానీ ఇవాళ నాకు ఎదురైన అనుభవం తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సైకిల్ ట్రాక్ పై రద్దీగా ఉన్న సమయంలోనే ఇలాంటి దారుణం జరగడంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.వ్యాయామం చేసే దుస్తుల్లో ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లు లేదా బైకర్లు తనను వింతగా చూస్తారని, ఇప్పుడు ఏకంగా స్పెషల్ ట్రాక్‌లపైన కూడా రక్షణ కరువైందని ఆమె పేర్కొంది.

ఆ వ్యక్తిని ఆమె వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా, అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో తన కెమెరా ఆన్ చేసి ఉంటే అతని ముఖం స్పష్టంగా కనిపించేదని ఆమె వీడియోలో వివరించింది.ఈ ఘటనతో హైదరాబాద్‌లోని ఉమెన్ సేఫ్టీ మరియు ప్రతిష్టాత్మక సైకిల్ ట్రాక్ వద్ద ఉన్న నిఘా వ్యవస్థపై నెటిజన్లు మండిపడుతున్నారు. షీ టీమ్స్ (She Teams) మరియు పోలీసులు వెంటనే స్పందించి ఆ దుండగుడిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana