
DSports Dec18 2025: ముంబై: శ్రీలంక వేదికగా జరిగిన తొలి అంధ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ముంబైలోని ఎంఐజీ క్రికెట్ క్లబ్‌లో మంగళవారం ఈ విజేత జట్టును సచిన్ స్వయంగా కలిశారు. సుమారు గంటసేపు వారితో గడిపి, వారి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సచిన్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. “చాలా మందికి కంటి చూపు ఉంటుంది, కానీ అతి కొద్ది మందికి మాత్రమే నిజమైన విజన్ (లక్ష్యం) ఉంటుంది. దేశం గర్వపడేలా చేసిన ఈ అద్భుతమైన యువతులతో సమయం గడపడం నాకు దక్కిన గౌరవం” అని పేర్కొన్నారు. క్రికెట్ అనేది కేవలం ఆడే ఆట మాత్రమే కాదని, అది అనుభవించే అనుభూతి అని వారు నిరూపించారని కొనియాడారు.
