తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) కీలక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ తరఫున సమగ్ర ‘ఛార్జ్‌షీట్’ను విడుదల చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ‘ఆరు గ్యారంటీల’ అమలులో వైఫల్యాలు నెరవేరని వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేటీఆర్ ప్రస్తావించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ ఛార్జ్‌షీట్‌లో ప్రధానంగా ప్రస్తావించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించిన కేటీఆర్ 1000 రోజుల పాలనలో ప్రజలకు ఎదురైన ఇబ్బందులు పెండింగ్‌లో ఉన్న హామీలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచారు.
అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు నెరవేరని హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వెల్లడించింది.


