భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం.. కొత్తగూడెం, ప్రగతి మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్గారు ,జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు , ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుగారు ,మేయర్ మూడ్ గణేష్ గారు తదితరులు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి తుమ్మల మాట్లాడుతూ, సాగునీటి నుంచి పారిశ్రామిక రంగం వరకు అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రేవంత్ రెడ్డి ప్రజా పాలన సాగిస్తున్నారని అన్నారు. ఎల్ నినో ప్రభావంతో సాగునీటి కోసం రైతాంగం ఆందోళన చెందుతున్న సమయంలో సీతారామ ప్రాజెక్ట్ భరోసాగా నిలిచిందన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టులోని లక్షా పాతిక వేల ఎకరాలకు గోదావరి జలాలను అందించామని తెలిపారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు రాగానే పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. భద్రాచలం రామాలయం అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.586 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని, భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా గోదావరిపై రెండో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణ ఆయిల్‌పామ్ హబ్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచిందన్నారు. తెలంగాణ సిరుల తల్లి సింగరేణి విస్తరణ కోసం కొత్త కోల్ బ్లాక్‌ల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణం సురక్షితంగా ఉండేలా కరకట్ట విస్తరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం రామాలయం అభివృద్ధి, విస్తరణ పనులను మొదటి దశలో పూర్తి చేస్తామని తెలిపారు. విద్యా రంగంలో కొత్తగూడెం ఖ్యాతి పెరిగేలా మన్మోహన్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని స్థాపించామని పేర్కొన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా జిల్లా యంత్రాంగం పనిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు

By Hemanth

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana