
సీఎం రేవంత్ రెడ్డి సొంత తమ్ముని కంపెనీకి ఫోర్త్ సిటీలో 5 ఎకరాలు కేటాయించారు. వందల కోట్ల విలువైన భూమిని తక్కువకు రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
మూడేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు.. కుంభకోణాలు తప్ప.. ఫోర్త్ సిటీ పేరుతో విచ్చల విడిగా సీఎం రేవంత్ పెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మన్నెక్రిశాంక్ మాట్లాడుతూ..నల్ల ధనాన్ని విదేశాలకు పంపి దాన్ని తెల్లగా మార్చుకోవాలని కుట్ర చేస్తున్నారని అన్నారు.
ట్రెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో అనుముల కొండల్ రెడ్డి షెల్ కంపెనీ ఏర్పాటు చేశారని.. కేవలం లక్ష రూపాయలతో ఒక చిన్న ఇంట్లో ఈ కంపెనీ పెట్టారన్నారు. ఈ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఏరో స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ ప్రొడక్షన్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి… కానీ ఈ కంపెనీకి లైసెన్స్ లేదు . ఈ కంపెనీ ఏమీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోయినా రూ. కోటి ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ వచ్చాయి.ఇంకో దారుణం ఏంటి అంటే కంపెనీలో అసలు ఒక్క ఉద్యోగి కూడా లేకుండా పటాన్‌చెరువులోని శ్రీకృష్ణ నగర్లో ఒక ఇంట్లో నడిపిస్తున్నారన్నారు.ఈ కంపెనీ షేర్ల విలువ కూడా కేవలం రూ. లక్ష మాత్రమేనన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత తమ్ముని కంపెనీకి ఫోర్త్ సిటీలో 5 ఎకరాలు కేటాయించారు. వందల కోట్ల విలువైన భూమిని తక్కువకు రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ కుటుంబ సభ్యులకు ఫోర్త్ సిటీ భూములు కట్టబెడుతున్నారు. దీనిపై సీఎం తన పదవి నుంచి వైదొలగి విచారణ జరిపించాలన్నారు. బీజేపీ నేతలు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. భూముల కేటాయింపు రద్దు చేయాలని.. సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
