
తెలంగాణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు గోల్కొండ కోటకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి పోలీసులు ఘన స్వాగతం పలికారు. సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.
