
జిల్లాలోని హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన కొనసాగుతోంది. ఉమ్మాపూర్‌లో రూ.7.28 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేసి జాతీయ జెండా ఎగురవేస్తామని చెప్పారు.
తెలంగాణలోనే తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ హుస్నాబాద్ నియోజకవర్గంలోనే పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు. శాతవాహన యూనివర్సిటీ కళాశాలకు త్వరలో మరో రెండు బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నప్పుడే విద్యాసంస్థలు అభివృద్ధి చెందుతాయని మంత్రి అన్నారు. హుస్నాబాద్‌కు త్వరలో కబడ్డీ అకాడమీని తీసుకువస్తామని వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అని, వాటిని సద్వినియోగం చేసుకుని మంచి ర్యాంకులు సాధించడం విద్యార్థుల బాధ్యత అని పేర్కొన్నారు.
