భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తన ఢిల్లీలోని నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించగా, కిషన్ రెడ్డి జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు.
ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత ఎనిమిది దశాబ్దాల్లో భారత్ అభివృద్ధి పథంలో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు.


