తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం అన్నారు. అదనంగా 2.25 లక్షల మందికి సామాజిక భద్రతా పెన్షన్లు అందించనున్నట్లు ప్రకటించారు. రైతులు, వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని తెలిపారు.
కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల్లో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థులపై వివక్షను అరికట్టేందుకు ‘రోహిత్ వేముల తెలంగాణ యాక్ట్’ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయని చెప్పారు. తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.

