పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. సభ ప్రారంభంలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా సభ్యులంతా కలిసి వందేమాతరం గీతంలోని ఆరు చరణాలను ఆలపించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయడంతో వర్షాకాల సమావేశాలు ముగిశాయి.

వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. జాతీయ గీతంతో సమానంగా వందేమాతరానికి చట్టపరమైన హోదా కల్పించేలా కొత్త నిబంధనలు ఉన్నాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమై ఆగస్టు 13న ముగిశాయి. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చింది. ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినా యాత్ర చేపట్టగా, యువతపై లాఠీచార్జ్ జరిగింది.

మరోవైపు పార్లమెంట్‌లో యాంటీ పేపర్ లీక్ బిల్లుతో పాటు పలు బిల్లులు ఆమోదం పొందాయి. యువతపై లాఠీచార్జ్‌కు ఆదేశాలిచ్చిందెవరో వెల్లడించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో సభలో పలుమార్లు వాయిదాలు చోటుచేసుకున్నాయి. చివరకు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటంతో సమావేశాలు ముగిశాయి.

By Rajini

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana