D Spiritual: Jul 20: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ సారె ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచే దర్శనానికి క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఈ ఉత్సవాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం సమయానికే సుమారు 65 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, ఆలయ సిబ్బంది దర్శనాలు సజావుగా సాగేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

దుర్గమ్మకు సారె సమర్పించేందుకు కూడా భక్తులు పెద్దఎత్తున క్యూ కట్టారు. ఇప్పటివరకు సుమారు 23,900 మందికి పైగా భక్తులు సారె సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల నామస్మరణలు, ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగుతోంది. సాయంత్రం వేళల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana