D News: Jul 24: EPFO సభ్యులకు గుడ్ న్యూస్.. ఇక పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు నేరుగా మొబైల్‌కు

పీఎఫ్ (EPF) ఖాతా ఉన్నవారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త చెప్పింది. ఇకపై పీఎఫ్ బ్యాలెన్స్ లేదా వడ్డీ వివరాలు తెలుసుకోవడానికి పదే పదే యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్ లేదా ఇతర మార్గాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీ ప్రమేయం లేకుండానే ఈపీఎఫ్ఓ నేరుగా మీ నమోదిత మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా ఖాతా వివరాలను పంపిస్తోంది.

ఇటీవల ఈపీఎఫ్ఓ పీఎఫ్ ఖాతాదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని విడతల వారీగా జమ చేసింది. ఈ నెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అర్హులైన సభ్యుల ఖాతాల్లో వడ్డీ క్రెడిట్ చేశారు. ఈ ఏడాది పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వార్షిక వడ్డీ రేటును అమలు చేయగా, నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని లెక్కించి జమ చేశారు.

గతంలో పీఎఫ్ వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్, ఎస్‌ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ సేవలను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఈపీఎఫ్ఓ నేరుగా మీ మొబైల్‌కు సందేశం పంపుతోంది. ఆ మెస్సేజ్‌లో మీ ఖాతాకు జమ అయిన వడ్డీ మొత్తం, అలాగే వడ్డీ జమ అయిన తర్వాత మార్చి 31, 2026 నాటికి మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్ వివరాలు అందుబాటులో ఉంటాయి.

అంతేకాకుండా, ప్రతి నెల యజమాని (Employer) మీ పీఎఫ్ ఖాతాలో చందా జమ చేసిన తర్వాత కూడా ఆటోమేటిక్‌గా ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. దీంతో ఖాతాలో డబ్బు జమ అయిందో లేదో తెలుసుకోవడానికి వెబ్‌సైట్ లేదా యాప్‌ను పదే పదే తెరవాల్సిన అవసరం ఉండదు.

ఒకవేళ మీ నమోదిత మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ రాకపోతే, యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్, మిస్డ్ కాల్ లేదా ఎస్‌ఎంఎస్ సేవల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ మొబైల్ నంబర్ ఈపీఎఫ్ఓ రికార్డుల్లో సరిగా అప్డేట్ అయి ఉండటం తప్పనిసరి.

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వార్షిక వడ్డీని నిర్ణయించింది. ఇది నెలకు సుమారుగా 0.688 శాతం వడ్డీకి సమానం. వడ్డీని నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కించినప్పటికీ, ప్రభుత్వం అధికారికంగా వడ్డీ రేటును ప్రకటించిన తర్వాత సంవత్సరానికి ఒకసారి సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు.

ఈసారి సుమారు 34 కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యుల ఖాతాలకు రూ.1.44 లక్షల కోట్లకుపైగా వడ్డీని జమ చేశారు. వడ్డీ క్రెడిట్ ఎంట్రీ ఖాతాలో ఆలస్యంగా కనిపించినా సభ్యులకు ఎలాంటి నష్టం ఉండదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఎందుకంటే నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగానే వడ్డీని లెక్కిస్తారు. కాబట్టి మీ మొబైల్ నంబర్ ఈపీఎఫ్ఓ ఖాతాతో అనుసంధానమై ఉంటే, ఇకపై పీఎఫ్ బ్యాలెన్స్ మరియు వడ్డీ వివరాలు నేరుగా మీ ఫోన్‌కే చేరతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana