DNews:12 Dec: తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ ఘన విజయం సాధించింది. అనేక చోట్ల బీఆర్‌ఎస్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించగా, అధికార కాంగ్రెస్ పార్టీ సగం స్థానాలు కూడా దక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా ములుగు జిల్లాలో జరిగిన ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ములుగు జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న ఏటూరు నాగారం సర్పంచ్ స్థానాన్ని మంత్రి సీతక్క ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఐదు సార్లు స్వయంగా ప్రచారం నిర్వహించినా, ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు.బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఓట్ల వివరాలు ఇలా…మొత్తం పోలైన ఓట్లు: 8,333, బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీలతకు: 5,520 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి: 2,330 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి: 64 ఓట్లు, 3,230 ఓట్ల భారీ మెజార్టీతో శ్రీలత ఘన విజయం సాధించడంతో, బీఆర్‌ఎస్ జిల్లాలోనే బలమైన స్థానాన్ని మరోసారి చాటుకుంది.ఈ ఫలితంతో మంత్రి సీతక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది.విజయం సాధించిన శ్రీలత,బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు సతీమణి.కావడం గమనార్హం.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana