DNews:12 Dec: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ (శుక్రవారం) లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారనే ఆరోపణతో ఈ నోటీసులు పంపినట్లు కవిత పేర్కొన్నారు.నోటీసులో వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కవిత స్పష్టం చేశారు. దీంతో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరఫున ‘జనం బాట’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆమె నిజామాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో విస్తృతంగా ప్రజలను కలుస్తున్నారు.గురువారం రోజు మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.కవిత వ్యాఖ్యలకు కృష్ణారావు కూడా తీవ్రంగా ప్రతిస్పందించడంతో, వివాదం మరింత ముదిరింది. అదే వివాదం కొనసాగుతుండగా, కవిత ఆయనకు కూడా లీగల్ నోటీసులు పంపించినట్లు సమాచారం.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana