
DNews:03 Dec:ఉస్మానియా యూనివర్సిటీలో నాన్-టీచింగ్ ఉద్యోగుల సమస్య మరోసారి ముందుకు వచ్చింది. ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీ పర్యటనకు ముందుగా, నాన్-టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజేషన్ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
గత ఇరవై ఏళ్లుగా 1117 మంది నాన్-టీచింగ్ ఉద్యోగులు తక్కువ జీతాలతో, ఎలాంటి ఉద్యోగ భద్రతా హామీలూ లేకుండా పనిచేస్తున్నామని వారు తెలిపారు. పెన్షన్, మెడికల్, సెలవులు వంటి మూలభూత ప్రయోజనాలు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలంటూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ నాన్-టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యారాల రాజేష్, జనరల్ సెక్రటరీ ఎ. అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కన్వీనర్ డా. వీరేషం, కో-కన్వీనర్ సి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
