DNews: Dec 03: కౌటాల మండలంలోని కౌటి-సంగ్గాం గ్రామానికి చెందిన కుర్బంకర్ అజయ్ (31) ఎరువుల దుకాణ యజమానిని బెదిరించి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను ఎస్పీ నితికా పంత్ కౌటాల సర్కిల్ కార్యాలయంలో మంగళవారం వెల్లడించారు. జూలై 12న అజయ్ వ్యాపారస్థుడి దుకాణంలో ఒక లేఖ అతికించి, రూ.50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే మహారాష్ట్రలోని చంద్రపూర్ బస్ స్టాండ్ వద్ద చంపేస్తానని హెచ్చరించాడు. యజమాని స్పందించకపోవడంతో, అదే నెలలో యూట్యూబ్ ద్వారా బీహార్‌లో ఆయుధాలు దొరుకుతాయని తెలుసుకొని, బాబు సాహెబ్ కుమార్ వద్ద రూ.55,000 చెల్లించి ఒక పిస్టల్, హ్యాండ్‌గన్, రెండు మ్యాగజైన్లు, 20 బుల్లెట్లు కొనుగోలు చేసి తుపాకీ వాడకం నేర్చుకున్నాడు. సెప్టెంబర్ 9న కాగజ్‌నగర్ నుండి మహారాష్ట్రకు రైలు ప్రయాణం చేస్తుండగా, బాధితుడికి ఒక తెలియని వ్యక్తి ఫోన్ చేసి మళ్లీ చంపేస్తానని బెదిరించాడు. బాధితుడు స్పందించకపోవడంతో, అక్టోబర్ 10న బాధితుడి తమ్ముడి ముఖంపై కాల్పులు జరిపాడు. అయితే లక్ష్యం తప్పడంతో అక్కడి నుండి పారిపోయాడు. బాధితులు కౌటాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సీఐ సంతోష్ కుమార్, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. మంగళవారం పోలీస్ చెక్‌లో అజయ్ ద్విచక్రవాహనంపై తుపాకీ, 3 బుల్లెట్లతో పట్టుబడ్డాడు. విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి పిస్టల్, హ్యాండ్‌గన్, రెండు మ్యాగజైన్లు, 15 చిన్న బుల్లెట్లు, ఒక పెద్ద బుల్లెట్, 5 ఖాళీ షెల్స్, సెల్‌ఫోన్, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana