
DNews:02 Dec:ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు వద్ద మంగళవారం జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన చోటుచేసుకుంది.
తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన కూరపాటి వెంకటేశ్వర్లు బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపార పనుల కోసం గుర్రాలపాడు సమీపంలోని ప్రధాన రహదారిపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా వచ్చిన గ్రానైట్ లారీ ఆయనను ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు లారీ టైర్ల కిందపడి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు.
అపఘాతం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఖమ్మం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనతో ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
