DNews:25 Nov:ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల మారుమూల గ్రామాల్లో పత్తి కొనుగోలు పేరుతో దళారులు రైతులను దోపిడీ చేస్తున్న ఘటనలు విస్తరించాయి. ప్రభుత్వంను పత్తి క్వింటాకు రూ. 8,110 ధర నిర్ణయించినప్పటికీ, దళారులు నాణ్యత పేరుతో కోతలు విధిస్తూ తేమ శాతం పట్టించుకోకుండా రూ. 6,300–6,500 మాత్రమే చెల్లిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అదే సమయంలో కొంతమంది వ్యాపారులు ఆసాముల పేరుతో పంటలను అతి తక్కువ ధరకు కొని, అనంతరం సీసీఐకి విక్రయించి భారీ లాభాలు పొందుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.సంబంధిత విభాగం అధికారుల పర్యవేక్షణలోపం వల్ల దళారీ దందా నిర్వాహకులు మరింత బలపడినట్లు సమాచారం. గ్రామాలకు వచ్చి పర్యటించే అధికారుల వాహనాలను దళారులు “సెట్టింగులతో” తప్పించుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.స్థితిగతులు ఇలా కొనసాగితే రైతులు మరింత నష్టపోతారని, దళారులపై ప్రత్యేక నిఘా పెట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana