
DNews:25 Nov:రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలన సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.మంగళవారం ఉదయం, ఆది శ్రీనివాస్ అధికారులతో కలిసి గృహ సముదాయాన్ని పరిశీలించడానికి వెళ్లారు.ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మరియు కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్మెంట్ ఫ్లోరింగ్‌పై నిల్చొని పరిశీలిస్తున్న సమయంలో, ఆ ప్రాంతంలో ఫ్లోరింగ్ ఒక్కసారిగా కుంగిపోయింది.ఈ ఊహించని ఘటనతో అక్కడున్న అధికారులతో పాటు అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.అయితే, వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్‌ను కింద పడిపోకుండా వెంటనే పట్టుకున్నారు. దీంతో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పెద్ద ముప్పు తప్పింది.డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడం నిర్మాణ ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
