
DNews:22 Nov:హైదరాబాద్ తెలంగాణలో వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల్లో ఆందోళన చెలరేగింది. దీనితో కేంద్ర, రాష్ట్ర కమిటీలకు చెందిన మావోయిస్టు నాయకులు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం డీజీపీ బీ. శివధర్ రెడ్డి ఎదుట లొంగుబాట పట్టారు. ఈ లొంగుబాటు రాష్ట్ర భద్రతా వ్యవస్థలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
సమాచారం ప్రకారం, లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్ర నేతలు ఆజాద్, కొయ్యడ సాంబయ్య, అప్పాస్ నారాయణ, ఎర్రాలు వంటి కీలక వ్యక్తులు ఉన్నారు. ఇటీవల మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన కఠిన చర్యలు, జరిగిపోయిన ఎన్‌కౌంటర్లు ఈ నిర్ణయానికి దారితీశినట్లు తెలుస్తోంది.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు ఈ సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. మావోయిస్టు ఉద్యమంపై భారీ ప్రభావం చూపే ఈ పరిణామంపై రాష్ట్ర భద్రతా సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.
