DNews:17 NOV:హనుమకొండ బస్ స్టేషన్ నుంచి వరంగల్-1 డిపోకు చెందిన శ్రీశైలం మరియు తిరుపతి వయా హైదరాబాద్ వెళ్లే రెండు రాజధాని ఏసీ బస్సు సర్వీసులను రీజినల్ మేనేజర్ డి.విజయభాను నవంబర్ 17న ప్రారంభించారు. తిరుపతికి వెళ్లే రాజధాని ఏసీ బస్సు ప్రతిరోజు ఉదయం 8:40 గంటలకు హనుమకొండ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3:45 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా, శ్రీశైలం వెళ్లే రాజధాని ఏసీ బస్సు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు హనుమకొండ నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ బస్సు ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్ మీదుగా ప్రయాణిస్తుంది. శ్రీశైలం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 7:15 నిమిషాలకు హనుమకొండ చేరుకుంటుంది. ఈ కొత్త ఏసీ బస్సు సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఎం విజయభాను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం భానుకిరణ్, వరంగల్-1 డిపో మేనేజర్ అర్పిత సహా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana